Telangana Health Director : మరో వివాదంలో తెలంగాణా హెల్త్ డైరెక్టర్
అప్పుడప్పుడు వివాదాస్పదంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్న తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇవాళ సియం పుట్టినరోజు సందర్బంగా వైద్యధికారులు అందరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని సర్క్యులర్ జారీ చేశారు.దీనితో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇలా వైద్యధికారులు అందరూ మొక్కలు నాటాలి అనడం ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయని పలువురు అధికారులు మండిపడుతున్నారు. కాగా గతంలో ఓ మతానికి సంభందించిన దేవుడి వల్లే కరోనా నుండి బయటపడ్డామని చెప్పడం తో పాటు…ఓ కార్యక్రమంలో సియం కేసీయార్ కాళ్ళు మొక్కడం కూడా వివాదాస్పదం అయింది.