Telangana New Cabinet : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న సమయంలో డిగ్రీ కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే అనేక రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇతర కీలక నాయకుడు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు.
దాంట్లో సభ్యుల సంఖ్యలో 15% మించి క్యాబినెట్లో ఉండకూడదు. ఆ లెక్కన చూసుకుంటే కొత్త క్యాబినెట్ లో 18 మందికి మాత్రమే చోటు దక్కనుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఇద్దరు విప్ లను కలుపుకుంటే, మొత్తంగా 23 మందికి అవకాశం ఉంటుంది. అయితే రేవంత్ క్యాబినెట్ లో చోటు తగ్గించుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. దీనిని ఎలా నిర్ణయిస్తారో చూడాలి.
ముఖ్యంగా పార్టీ కోసం ఎప్పటినుంచో పని చేస్తున్నటువంటి సీనియర్ నేతలు తమకు పదవులు ఇవ్వాలని పట్టుబట్టారు. ఢిల్లీ అధిష్టానం పెద్దల వద్దకు ఇప్పటికే మల్లు బట్టు విక్రమార్క వంటి నేతలు మతనాలు కూడా జరిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఒకవేళ ఆయన ఇస్తే ఆయన సతీమణి పద్మావతికి తెలంగాణ క్యాబినెట్ లో అవకాశం ఇస్తుందా, లేదా, అనే అంశం కూడా తెరపైకి వస్తుంది.
ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలలో ఎవరికి ఛాన్స్ దక్క పోతుందో అర్థం కాని పరిస్థితి. మరోరకంగా ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కి ఎలాంటి స్థానాలు ఇవ్వబోతున్నారని సస్పెన్స్ కూడా ఉంది. వీరితోపాటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఒక కీలక పదవి దక్కనుందని సమాచారం. అందుతుంది.
మరో పార్టీ సీనియర్ నేత కొండ సురేఖ పరిస్థితి ఏంటని ప్రశ్న,? కూడా తలైతుతుంది. ఇలా అనేక రకాల అంశాలు క్యాబినెట్ చుట్టూ ఆసక్తిగా మారాయి. సామాజిక వర్గాల లెక్కింపు ప్రకారం కొత్త క్యాబినెట్ కొలువు తిరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ సీనియర్లు అయినటువంటి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
అలాగే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన విజయశాంతి పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. వీరితో పాటు వివేక్ సైతం మంత్రి పదవిలో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి సిపిఎం పొత్తులో భాగంగా హామీ ఇచ్చిన మేరకు తమకు రెండు ఎమ్మెల్సీలు వస్తాయని ఆశిస్తుంది. సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం అవకాశాలు ఉన్నాయని సమాచారం వెల్లడవుతుంది.
ఈ రకంగా చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మల్లు బట్టి విక్రమార్క, గడ్డం వివేక్, లేదా గడ్డం వినోదు, దామోదర రాజనర్సింహ, వంశీకృష్ణ అద్దంకి ,దయాకర్. బీసీ సామాజిక వర్గం పొన్నం ప్రభాకరు, బీర్ల ఐలయ్య, శ్రీహరి ఆది శ్రీనివాస్, కొండా సురేఖ ఈర్లపల్లి శంకర్, ఎస్టీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే సీతక్క, కమ్మ సామాజిక వర్గం తుమ్మల నాగేశ్వరరావు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించి వర్గం ప్రేమ్ సాగర్ రావు.
జూపల్లి కృష్ణారావు, గంట సత్యనారాయణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది కీలక నేతలపై వినిపిస్తున్నాయి. వీరందరిని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం క్యాబినెట్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఎవరికి క్యాబినెట్ లో అవకాశం దక్కిస్తుందో చూడాలి.