Television : టీవీ అందరి ఇళ్లల్లో ఉండడం ఇప్పుడు సర్వసాధారణం. టీవీ లేని ఇల్లంటూ ఉండడం కష్టమే. ఇప్పుడున్న జీవన విధానంలో టీవీ అందరికీ చాలా అలవాటైపోయిన సాధనం. టీవీ ఇంట్లో ఉంటే మనుషులతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. అలా అందరితో మమేకమై, ఇంట్లో ఒక భాగం అయిపోయింది.
మరి అలాంటి టీవీ స్క్రీన్ ని గమనించారా..అది ఏ రంగులో ఉంటుందో ఎప్పుడైనా చూసారా.. టీవీ ఆన్ చేసినప్పుడు అలాగే ఆఫ్ చేసినప్పుడు కూడా స్క్రీన్ నలుపు రంగులోనే కనబడుతుంది. మరి ఆ రంగు వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా టీవీ ఆఫ్ చేసిన ఆన్ చేసిన డిస్‌ప్లే బ్యాక్ లైట్ ఆఫ్ అయిపోతుంది. కొన్ని టీవీల స్క్రీన్లు ఆఫ్ చేసినప్పుడు నీలం,
ఎరుపు రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా వేరే రంగులో కనిపించాలంటే టీవీలోని సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు స్క్రీన్ నలుపు రంగులో కాకుండా వేరే రంగులో కనిపిస్తూ ఉంటుంది.కానీ కొన్ని టీవీలకు మాత్రమే ఈ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేసుకోవాలంటే సెట్టింగ్స్ యాప్ నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీవీ స్క్రీన్ ని ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ ఎక్స్ఎల్ నుంచి కాంతి విడుదల చేసే CRT,OLED,ప్లాస్మా స్క్రీన్ లు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని ఒక కారణంగా చెప్తారు. మరికొందరు టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటమే కారణం అని, దానివల్లే టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు.