The First Flower in Space : అంతరిక్షంలో ఉన్న అద్భుతాలను ప్రపంచానికి తెలియజేయడంలో నాసా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ఈ సృష్టిలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి అహర్నిశలు తమ వంతు కృషిని నాసా చేస్తూనే ఉంటుంది. అలా నాసా అంతరిక్షంలో ఎన్నో విషయాలను మన కళ్ళ ముందు ఉంచింది. అద్భుతాలను సృష్టించింది.
దాంట్లో భాగంగానే తాజాగా అంతరిక్షంలో పువ్వును పూయించి శాస్త్రవేత్తలు ఈ సృష్టికి మరో అద్భుతాన్ని అందించారు. నాసా సైంటిస్టులు కక్షలో పెరిగిన జిర్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. శాస్త్రవేత్తల కృషి ఇప్పటిది కాదు. 1970 నుంచి అంతరిక్షంలో మొక్కలపై వీరు అధ్యయనం చేస్తున్నారు.

2015లో నాసా వ్యోమగామి కేజెల్ లిండ్ గ్రేన్ ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. అంతరిక్షంలో పువ్వును పూయించడంపై నెటిజెన్లు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకు కనిపించని ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో ఇలా పువ్వు విరబూయడం అందరిని ఆనందమయం చేస్తుంది. కొత్త,కొత్త ప్రయోగాలు చేయడంలో నాసా ఎప్పుడు ముందు ఉంటుంది.
అలాగే అంతరిక్షంలో పంటలు పండించేందుకు కూడా శాస్త్రవేత్తలు వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అంతరిక్షంలో టమాటోలు, పాలకూర, ఆకూరలు, చిల్లీ పేపర్ లాంటి కాయగూరలు శాస్త్రవేత్తలు పండించారు. వీటితోపాటు మరిన్ని రకాల కూరగాయలను రానున్న రోజుల్లో పెంచుతాము అనీ శాస్త్రవేత్తలు తెలిపారు.
