The Mystery of Death : మరణం ఈ పేరు వింటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు. ఆత్మగా మారుతాడా.. ఇంకో ప్రపంచం ఉంటుందా.. లేక శూన్యంలో కలిసి పోతాడా.. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మనిషి మెదడులో మెదులుతూ ఉంటాయి. కానీ ఇప్పటివరకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు. కానీ తాజాగా ఒక అమెరికాకు చెందిన డాక్టర్ మాత్రం మరణం తర్వాత మరో లోకం ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందినటువంటి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. జెఫ్రీ లాంగ్ సంచలన విషయాలు వెల్లడించారు. డాక్టర్ జెఫ్రీ లాంగ్ 1998 లో నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్ స్థాపించి, మరణ అంచుదాకా వెళ్ళినటువంటి 5000 మంది పైన అధ్యయనం చేశారు. వీలలో ముఖ్యంగా గుండె ఆగిపోవడం లేదా కోమాలో ఉన్న వారి అనుభవాలను నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారని డాక్టర్ వివరిస్తూ.. మరణం చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చిన వారిలో కొందరు తమ శరీరం పని చేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగామని, అక్కడ ఏం జరుగుతుందో వినగలిగామని చెప్పారు అన్నారు.
5000 మంది అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన జెఫ్రీ మరణం తర్వాత ఆత్మ ఉనికిని వివరిస్తూ మరో ప్రపంచం ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యాయంలో తనకు ఎన్నో ఆధారాలు కూడా లభించాయని మరణం తర్వాత మరో ప్రపంచం ఖచ్చితంగా ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు నియర్ డెత్ అనుభవం ఎదుర్కొన్న వారిలో దాదాపు 45 శాతం మంది తమ ఆత్మ శరీరం నుంచి వేరైనా విషయాన్ని గుర్తించినట్లు డాక్టర్ తెలపడం ఇక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
శరీరం నుండి ఆత్మ దూరమైన కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ.. శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అక్కడే కాసేపు తిరిగి అక్కడ జరుగుతున్న విషయాలను గమనించినట్లు చెప్పడం, మరికొందరేమో తమ ఆత్మ ఓ సొరంగంలో నుంచి ప్రయాణిస్తూ ఒక వెలుతురు వైపు ప్రయాణం చేసిందని చెప్పడం, అదేవిధంగా గతంలో చనిపోయినటువంటి స్నేహితులు, బంధువులను కలుసుకున్నట్టుగా కూడా వారు తెలిపారు. తమ జీవితం మొత్తం క్షణకాలం పాటు తమ కళ్ళ ముందు కదిలినట్టు వివరించారని డాక్టర్ జెఫ్రీ తెలిపారు. ఇలాంటి అనుభవాలను శాస్త్రీయ వివరించే ఆధారాలేవి దొరకలేదు అని చెప్తున్న జఫ్రీ ఆత్మలు మరణం తర్వాత జీవితం మాత్రం నిజమేననీ స్పష్టం చేశాడు.