ఆరోగ్యం దృష్ట్యా కొంతమంది, జంతువుల సంరక్షణ, పర్యావరణ వనరుల పరిరక్షణ కోసం ఇంకొంతమంది శాకాహారాన్ని ఎంచుకునేవారు. ఇంకొందరేమో సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తూ శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు. ఇటీవల కాలంలో కర్బన ఉద్గారాల నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసమంటూ ప్రత్యేకంగా కొందరు శాకాహారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే తాజా సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య తగ్గుతుందా అంటే.. అవుననే అంటున్నాయి సర్వేలు.
ఐరోపా లేదా బ్రిటన్ దేశాల్లో వీరి సంఖ్య తగ్గుతోంది. స్టాటిస్టా గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారం క్షీణిస్తోందని నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు భారత్‌లోనూ సాంప్రదాయక శాకాహారులు కూడా ఆహారం కోసం రెండు విధానాలను పాటిస్తున్నారు. మాంసాహారాన్ని కూడా తీసుకుంటున్నారు. 2018/2019 పట్టణ భారతీయులలో మూడొంతుల మంది తాము శాకాహారులమని పేర్కొనగా, 2021/2022 నాటికి ఈ సంఖ్య దాదాపు నాలుగింట ఒకవంతుకు తగ్గింది.
గత మూడేళ్లలో శాకాహారం జనాదరణ పొందినప్పటికీ కొన్ని దేశాల్లో మాంసాహారాన్ని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. మెక్సికో, స్పెయిన్లలో శాకాహారుల రేటు ఇటీవల 3 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. 2018/2019లో శాకాహారుల రేటు 3 శాతం దగ్గర ఉండగా, దక్షిణ కొరియాలో కూడా ఇంచుమించు ఇదే శాతం నమోదైంది. 2018/2019లో శాకాహారుల రేటు 0.9 శాతం నుండి పెరిగింది.
Discussion about this post