The Raja Saab: ప్రభాస్ అభిమానులకు ఒకరోజు ముందే పండగ.. దసరాకు ‘ది రాజా సాబ్’ ట్రైలర్ విడుదల
The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో, మేకర్స్ ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
‘ది రాజా సాబ్’ ట్రైలర్‌ను దసరా పండుగ కానుకగా, అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ పీరియాడిక్ హారర్ కామెడీ డ్రామాలో ప్రభాస్ సరసన ముగ్గురు కథానాయికలు – నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, సప్తగిరి, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, బొమ్మన్ ఇరానీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘ది రాజా సాబ్’ సినిమా నిర్మాణ విలువలు, నటీనటుల ఎంపిక ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా, దసరా రోజున ట్రైలర్ విడుదల అయితే, ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంది.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం కొన్ని పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని నిర్మాత వెల్లడించారు. మొత్తం 4.30 గంటల నిడివి ఉన్న ఫుటేజ్‌ను ఎడిట్ చేసి కుదించాల్సి ఉందని ఆయన చెప్పారు. ‘ది రాజా సాబ్’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మాస్, క్లాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమాలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచే రాజ్ మహల్ సెట్‌ను రూ. 7 కోట్లకు పైగా వ్యయంతో ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నిర్మించారు. ఈ భారీ సెట్ సినిమాకి సరికొత్త లుక్ తీసుకొస్తుందని చిత్ర బృందం పేర్కొంది.