గృహహింస అనేది.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా వయసు పరిమితి లేకుండా అందరూ ఎదుర్కొంటున్న సమస్య. అయితే సాధారణంగా గృహ హింసలో, భర్త నేరస్తుడు. భార్య బాధితురాలుగా ఉంటుంది. అయితే దక్షిణ కొరియాలో అంతా తలకిందులైంది. భర్తను భార్య 29 గంటల పాటు ఇంట్లో బంధించి ఏకంగా అత్యాచారం చేశారని ఆరోపించారు. తనపై 40 ఏళ్ల భార్య అత్యాచారానికి పాల్పడిందని భర్త ఆరోపించాడు. DailyMail ఆన్‌లైన్ ఈ వార్తను నివేదించింది.
అలాగే దక్షిణ కొరియాలో ఇలాంటి కేసు ఇదే మొదటిదని పేర్కొంది. ఇంతకు ముందు భార్య చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా భర్త అత్యాచారానికి గురైన సందర్భాలు లేవు. దక్షిణ కొరియాలో గృహ హింస ఇంతకు ముందు అత్యాచారంగా పరిగణించబడలేదు. 2013లో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించింది.
దీనికి శిక్షను కూడా నిర్ణయిస్తారు. అయితే భార్య అత్యాచారం చేస్తే శిక్ష ఏమిటన్నది నివేదికలో స్పష్టంగా లేదు. ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అందుకు తగిన కారణాలు అతని వద్ద లేవు. ఈ నేపథ్యంలో విడాకుల కోసం బలమైన కారణాన్ని సృష్టించేందుకు ఆమె తన భర్తపై 29 గంటల పాటు లైంగిక దాడికి పాల్పడిందని డైలీమెయిల్ ఆన్లైన్ పేర్కొంది.
