టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా శనివారం సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఏంతో శ్రమించి పోరాడుతుంది అంటూ ప్రశంసలు కురిపిస్తూనే రాబోయే విపత్కర పరిస్థితుల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాబోయే రోజుల్లో జరగబోయే దాని మీద ఆయన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి ” ఈరోజులు చాలా కఠినమైన, మనం అందరం ఒక మహమ్మారితో పోరాడుతున్నాం, ఇది మానవాళికి చాలా బాధకరమైన సందర్భం. జరిగినది ఏదో జరిగిపోయింది, అంతా మన ఖర్మ ఫలితమే గతంలో చేసిన ఖర్మ ఫలితం అనుభవించాం. కానీ రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం మరో అత్యంత కఠినమైన మహమ్మారితో పోరాడాల్సి అవసరం ఉంది, అందుకు ఇప్పటి నుండే సిద్దంగా ఉండాలి” అంటూ తన భావాలని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలియచేసారు.
“అలాగే ప్రతీరోజూ నేను ప్రార్థిస్తూ ఉంటాను, ఈ మహమ్మారి త్వరగా ప్రజలని విడిచిపోవాలని మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు అందరూ ఈ మహమ్మారి నుండి త్వరగా బయటపడాలి అని ప్రార్థిస్తున్నట్టు” తెలిపారు దలైలామ.