These Apps are Dangerous on the Phone : ఈరోజుల్లో ఫోన్ లేనిదే ఏ పని కూడా చేయలేము. ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్ కచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఫోన్ ని వాడే విధానం కూడా తెలిసి ఉండాలి. మనకు అవసరం లేని యాప్స్ ఉంచడం వల్ల ఫోన్ హ్యాక్ అవడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా ఈమధ్య చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి.
వాటి వల్ల ఉపయోగం కంటే సమస్యలే ఎక్కువగా తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు యాప్ గురించి పూర్తి అవగాహన లేనప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. అలా చేస్తే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయవలసి వస్తుంది. మరి మన ఫోన్లో ఉండకూడని యాప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యాప్స్ వినియోగం భారీగా పెరగడంతో టేక్ కంపెనీలు కూడా దానికి తగ్గట్టుగా కొత్త యాప్స్ ని తీసుకొస్తున్నారు. కానీ దీంట్లో ఏవి నిజమైనవో ఏవి ఫేక్ యాప్స్ గుర్తించడం చాలా కష్టం. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్‌ను లక్ష్యంగా చేసుకొని యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసే సమయంలో పర్మిషన్స్ అడిగి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్స్ దొంగిలిస్తున్నాయి. ముఖ్యంగా వాటిలో లోన్ యాప్స్ మొదటి వరుసలో ఉంటున్నాయి.

ఈ లోన్ యాప్స్ లోన్ తీసుకున్న వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అధిక వడ్డీని లాగుతూ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వివరాలు ఈ మధ్య ఈసెట్ పరిశోధకులు కూడా వెల్లడించారు. అయితే ఈ యాప్ లు ఒక భారత దేశంలోనే కాదు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోనూ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొత్తం 18 యాప్ లను గుర్తించగా, గూగుల్ ఇప్పటికే 17 యాప్స్ ని తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి తొలగించిన యాప్స్ జాబితా ఏంటో మనం కూడా తెలుసుకుందాం..
ఏఏ క్రెడిట్, అమోర్ క్యాష్, గేయబాక్యాష్, ఈజీ క్రెడిట్, క్యాష్‌వావ్, క్రెడిబస్, ఫ్లాష్‌లోన్, ప్రెస్టమోస్‌క్రెడిటో, ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్, గో క్రెడిటో, ఇన్స్టంటానియో ప్రెస్టమో, కార్టెరా గ్రాండే, రాపిడో క్రెడిటో, ఫైనప్ లెండింగ్, ఫోర్‌ఎస్ క్యాష్, ట్రూనైరా, ఈజీ క్యాష్ ఇలాంటి యాప్ లు మీ ఫోన్ ప్లే స్టోర్ లో గనుక ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. అని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి..
