These are the Symptoms of Corona Sub Variant : కరోనా ఈ పేరు వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. అప్పటి రోజులను జనాలు ఇంకా మర్చిపోలేక పోతున్నారు. కరోనా పెట్టిన వ్యధ అంతా, ఇంతా కాదు. ఒక్కసారిగా మానవాళిని మొత్తం అతలాకుతలం చేసేసింది. ఇంకా కాలక్రమేన తగ్గుముఖం పట్టింది. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. కానీ ఇప్పుడు మరో మారు కరోనా కలకలం సృష్టిస్తుంది.
అవును మీరు వింటున్నది నిజమే, కరోనా మళ్లీ విజృంభిస్తుందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే చాలామందిలో ఈ లక్షణాలు సోకి ఇబ్బంది పడుతున్నారని, ఒకరి ద్వారా ఒకరికి కరోనా సోకుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ముఖ్య ఆధారంగా ఈ మధ్య నెలకొన్న పరిస్థితులు అని చెప్పవచ్చు.
దేశంలోనే తొలిసారిగా కరోనా కొత్త సబ్ వేరియంట్ కేరళలో JN 1 బయటపడింది. అయితే దీనిని ముందుగానే సెప్టెంబర్ లో జపాన్ లో గుర్తించారు. ఇది కాలక్రమేన 38 దేశాలకు పాకినట్టుగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించడానికి లక్షణాలు ఏంటో కూడా వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరము లాంటివి ఉంటే వెంటనే పరీక్షలు
చేయించుకోవాలని, లేకపోతే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండి ప్రమాదాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాను మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్న ప్రజలలో మరో కొత్త రకం కరోనా సబ్ వేరియంట్ పేరుతో టెన్షన్ పెడుతుంది. ఆరోగ్యశాఖ వారు అప్రమత్తమై ముందుగానే ఇలాంటి కేసులను ముందస్తు చర్యలను తీసుకుంటే ప్రమాదం నుంచి కాస్తయినా బయటపడవచ్చు.