అమెరికాలో మూడో విడత (3rd Wave) కరోనా విస్తరణ మొదలైంది. గత రెండు విడతలకంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
కొవిడ్ ట్రాకింగ్ చెప్తున్న లెక్కల ప్రకారం లో శుక్రవారం అమెరికాలో అత్యధికంగా 83,010 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ మొదలయ్యాక అమెరికాలో ఒకరోజులో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. అమెరికాలో గత వేసవిలో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు జూలై 17 న 76,843 కేసులు నమోదయ్యాయి. అప్పటికి అదే ఒక్కరోజులో నమోదు అయిన కేసుల్లో ప్రపంచరికార్డు. కాగా నిన్న నమోదు అయిన 83,010 కేసుల్లో 6000 కేసులు బ్యాక్ లాగ్ నుండి వచ్చిన వాటితో కలిపిచెప్పినవే.
ఇంక పాజిటివ్ రేటు విషయానికి వస్తే శుక్రవారం 6.5 పర్సంటేజ్ గా నమోదు అయింది. అక్టోబర్ చివరి నుండి అమెరికాలో శీతాకాలం మొదలైంది, చల్లటి వాతావరణం వల్ల చాలామంది ఇండోర్స్ లోనే ఉండాల్సిన పరిస్థితి. దానివల్ల వైరస్ ఇంకా స్పీడ్ గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గురువారం 73,000 కేసులు నమోదు అయ్యాయి. ఇది కూడా సమ్మర్ తర్వాత నమోదు అయిన అత్యధిక కేసుల రికార్డే. ఇక శుక్రవారం అయితే ఆల్ టైం రికార్డ్ వైపుకి వెళ్ళింది. చూస్తుంటే అమెరికాకి గడ్డు పరిస్తితులు తప్పేటట్టులేవు. వైరస్ కూడా ఎక్కడా తగ్గే సూచనలు దగ్గరలో కనిపించడం లేదు.