The Great Pre Wedding Show: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టెలివిజన్ ప్రీమియర్ ఫిక్స్.. ఎప్పుడంటే?
The Great Pre Wedding Show: ‘జార్జిరెడ్డి’, ‘పలాస 1978’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ నటించిన సరికొత్త చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. టీనా శ్రావ్య కథానాయికగా నటించిన ఈ ఫీల్-గుడ్ డ్రామా నవంబర్ 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, విభిన్నమైన కథాంశం, నటీనటుల నటనకు మంచి స్పందన లభించింది. థియేటర్లలో విజయవంతమైన టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా ప్రేక్షకులను మెప్పించింది.
ఇప్పుడు, ఈ చిత్రం టీవీ ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ జీ తెలుగు ఛానెల్‌లో టెలివిజన్ ప్రీమియర్ కానుంది. డిసెంబర్ 14న సాయంత్రం 6:30 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది. వివాహానికి ముందు జరిగే సరదా సన్నివేశాలు, భావోద్వేగాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కథను అందించి దర్శకత్వం వహించిన రాహుల్ శ్రీనివాస్, అప్పటి తరం పెళ్లి వేడుకల నేపథ్యాన్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.
ఓటీటీలో మంచి స్పందన లభించిన ఈ సినిమా, ఇప్పుడు టీవీలో ఎలాంటి రేటింగ్స్‌ను నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తిరువీర్, ప్రముఖ నటి ఐశ్వర్యా రాజేశ్‌తో కలిసి నటిస్తున్న మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ టీవీ ప్రీమియర్‌తో తిరువీర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
