This Food is Very Dangerous for Mental Health : సంపూర్ణ ఆరోగ్యానికి మంచి డైట్ ఫాలో అవాల్సి ఉంటుంది. సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాలను తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. ముఖ్యంగా ఏది తిన్నా కూడా దాని ప్రభావం మన ఆరోగ్యం పైనే ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో ఆచితూచి తినవలసి ఉంటుంది.
మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ఆహా పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రుచిని ఇష్టపడుతుంటారు. కొందరికి తీపి ఇష్టం ఉంటే కొందరికి కారం ఇష్టం ఉంటుంది. అయితే తీపి అధికంగా తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, ఆ ప్రభావం మెదడుపై చూపిస్తుందని అందుకే అతిగా తీపి తినే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కెఫిన్ శరీరానికి ఏ మాత్రం మంచిది కాదు. అలాగే కడుపు సంబంధిత సమస్యలను ఈ కేఫిన్ పెంచుతుంది. వాటితో పాటు నిరాశలను, ఆందోళన కూడా ఈ తీపి, కెఫిన్ కలిగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఎంత ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు.
అలాగే అధిక కొవ్వు పదార్థాలు కూడా చాలావరకు దూరంగా ఉండాలి. వీటివల్ల మన శరీరంలో కొవ్వు పేరుకు పోతూ ఉంటుంది. మెదడులోని నరాలు కూడా బలహీనపడుతుంటాయి. అసలు పని చేయలేని స్థితిలో కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మద్యం తాగడం అలవాటున్న వారు అది మానివేయడం మంచిది. లేకపోతే డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల మెదడులో మంటలు కలిగే అవకాశాలున్నాయి.
వీటిని తినడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు మనం ఆ రకంగా నడుచుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న, అనారోగ్యం పడాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంటే ఏ హాస్పిటల్ కూడా వెళ్లవలసిన అవసరం లేదు. చాలా ఉత్సాహంగా మన రోజులు గడిచిపోతాయి.