OTT Movies: ఈ వారం ఓటీటీలో జాతరే.. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్‌లతో ఫుల్ ప్యాకేజ్
OTT Movies: ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. థియేటర్లలో అలరించిన భారీ చిత్రాలతో పాటు, నేరుగా ఓటీటీలో విడుదలయ్యే ఆసక్తికరమైన కంటెంట్‌తో ఈ వారాంతం ఫుల్ మీల్స్ అందించనున్నాయ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సన్‌నెక్స్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్ జానర్‌లలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీ విడుదలల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది నితిన్ నటించిన ‘తమ్ముడు’. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, సోదరి సెంటిమెంట్‌తో కూడిన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు.
ఆకట్టుకుంటున్న ఇతర చిత్రాలు..
3BHK (త్రీబీహెచ్‌కే): విలక్షణ నటుడు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘3BHK’. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి పడే తపనను, ఎదుర్కొనే సవాళ్లను హృద్యంగా చూపించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
జిన్ – ది పెట్: హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారి కోసం సన్‌నెక్స్ట్ ‘జిన్ – ది పెట్’ అనే చిత్రాన్ని అందిస్తోంది. ఒక పెంపుడు జంతువు వల్ల ఎదురైన విచిత్రమైన, భయానక పరిస్థితుల చుట్టూ తిరిగే ఈ కథ నవ్విస్తూనే భయపెడుతుంది.
కన్నప్ప: భక్తిరస చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల కోసం విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించిన ‘కన్నప్ప’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రాలతో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు, ఇతర భాషా చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ అభిరుచికి తగిన చిత్రాన్ని ఎంచుకుని ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.
