OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రాబోయే సినిమాలివే.. ఏడు రోజులు పాటు ఎంజాయ్ చేసేయండి!
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రేక్షకుల కోసం వినోదం వెల్లువలా వచ్చి చేరింది. థియేటర్లో అలరించిన పలు సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు వివిధ స్ట్రీమింగ్ సర్వీసుల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి, అలాగే ప్రేక్షకులను ఆకట్టుకున్నవి ఇక్కడ చూద్దాం.
ప్రముఖ సినిమాలు, సిరీస్‌లు
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కింగ్‌డమ్’ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. అన్నదమ్ముల మధ్య సాగే ఈ గ్యాంగ్‌స్టర్ కథ ఓటీటీ 0ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నారు.
ఇక, జులైలో విడుదలైన పోలీస్ డ్రామా ‘ది 100’ కూడా ఓటీటీలో వచ్చింది. ఆర్కే సాగర్, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, వీవీ గిరిధర్ కీలక పాత్రలు పోషించారు.
ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా ‘మెట్రో ఇన్ డినో’ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆధునిక ప్రేమ, సంబంధాలపై దృష్టి సారించింది.
శ్రీసింహా హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘భాగ్ సాలే’ కూడా కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్..
మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్(సిరీస్)
ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (సినిమా)
టూగ్రేవ్స్ (స్పానిష్)
అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ సినిమా)
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) ఆగస్టు 30
అమెజాన్ ప్రైమ్..
అప్‌లోడ్ 4 (వెబ్‌సిరీస్)
హాఫ్ సీఏ2 (హిందీ సిరీస్)
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ)
జియో సినిమా..
థండర్‌బోల్ట్స్ (సినిమా)
అటామిక్ -వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (హాలీవుడ్)
హౌ ఔ లెఫ్ట్ ద ఓపస్ డే (ఇంగ్లీష్ సిరీస్)
రాంబో ఇన్ లవ్ (తెలుగు)
జీ5..
శోధ (కన్నడ సిరీస్)
సోనీలివ్..
సంభవ వివరణమ్ నలర సంఘం (మలయాళ సిరీస్)
ఈటీవీ విన్..
లెక్కల మాస్టర్ (కథా సుధ) ఆగస్టు 31
సన్‌నెక్ట్స్..
మాయకూతు (సినిమా)
ఆహా (తమిళ్)..
ది డోర్ (సినిమా)