• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Best Indian Movies: 21వ శతాబ్దపు భారతీయ ఐకానిక్ చిత్రాలివే.. ‘ఈగ’, ‘దృశ్యం’ సినిమాలకు అంతర్జాతీయ గౌరవం

Best Indian Movies: 21వ శతాబ్దపు భారతీయ ఐకానిక్ చిత్రాలివే.. 'ఈగ', 'దృశ్యం' సినిమాలకు అంతర్జాతీయ గౌరవం

Sandhya by Sandhya
November 12, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Best Indian Movies: 21వ శతాబ్దపు భారతీయ ఐకానిక్ చిత్రాలివే.. ‘ఈగ’, ‘దృశ్యం’ సినిమాలకు అంతర్జాతీయ గౌరవం
Spread the love

Best Indian Movies: 21వ శతాబ్దపు భారతీయ ఐకానిక్ చిత్రాలివే.. ‘ఈగ’, ‘దృశ్యం’ సినిమాలకు అంతర్జాతీయ గౌరవం

 

Best Indian Movies: ప్రముఖ అంతర్జాతీయ సినీ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా, భారతీయ సినిమా అభిమానుల కోసం ఒక సంచలనాత్మక జాబితాను విడుదల చేసింది. 21వ శతాబ్దంలో (2000 సంవత్సరం తర్వాత) విడుదలైన అత్యుత్తమ 25 భారతీయ చిత్రాలను ఎంపిక చేస్తూ, “THR India’s 25 in 25: The Best Indian Movies of the 21st Century” పేరుతో ఈ ర్యాంకింగ్‌ను ప్రకటించింది. దేశీయ సినిమా దశను, దిశను మార్చిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఎన్నో ఐకానిక్ చిత్రాలు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ప్రధానంగా హిందీ (బాలీవుడ్) చిత్రాలు ఉన్నప్పటికీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి వివిధ ప్రాంతీయ భాషా చిత్రాలు తమ సత్తాను చాటాయి. ముఖ్యంగా, మన తెలుగు సినిమా నుంచి, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన దృశ్య అద్భుతం ‘ఈగ’ (2012) చోటు దక్కించుకోవడం తెలుగు ప్రేక్షకులందరికీ గర్వకారణం. విజువల్ ఎఫెక్ట్స్, అసాధారణ కథనంతో ‘ఈగ’ అంతర్జాతీయంగా మన సినిమా స్థాయిని పెంచింది.

మలయాళ సినిమా నుంచి మోహన్‌లాల్ నటించిన థ్రిల్లర్ కళాఖండాలు ‘దృశ్యం 1 & 2’ రెండూ ఈ 25 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ ప్రేమకథా చిత్రం ‘అలైపాయుథెయ్’ (తెలుగులో సఖి) 2000 సంవత్సరం నాటికే ప్రేమ చిత్రాలకు కొత్త ఒరవడిని సృష్టించినందుకు జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

1. స‌ఖి
2. స‌త్యం సుంద‌రం
3. అంగ‌మలై డైరీస్
4. ఆశ జోర్ మఝే
5. చక్ దే! ఇండియా
6. కోర్ట్
7. దిల్ చాహ్తా హై
8. దృశ్యం 1, 2
9. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్
10. ఈగ
11. కుంబలంగి నైట్స్
12. ల‌గాన్
13. ల‌క్ బై ఛాన్స్
14. మహేషింటే ప్రతికారం
15.మాన్‌సూన్ వెడ్డింగ్
16. నగర్ కీర్తన్
17. ఓంకారా
18. పారియారుమ్ పెరుమాల్
19. పీకు
20. సైర‌ట్
21. సర్పట్ట పరంబరై
22. ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్
23. ఉడాన్
24. ఉలిదవరు కందంటే
25. విస‌ర‌ణై

 


Spread the love
Tags: 21వ శతాబ్దపు ఉత్తమ భారతీయ చిత్రాలు జాబితాBest Movies in Indian Cinema HistoryDrishyam 1 2 International ListHollywood Reporter Best Indian MoviesList of the Best Indian Movies of the 21st CenturyRajamouli's Eega International RecognitionTHR India Top 25 MoviesTHR ఇండియా టాప్ 25 సినిమాలుదృశ్యం 1 2 అంతర్జాతీయ జాబితాభారతీయ సినీ చరిత్రలో ఉత్తమ చిత్రాలురాజమౌళి ఈగ అంతర్జాతీయ గుర్తింపుహాలీవుడ్ రిపోర్టర్ బెస్ట్ ఇండియన్ సినిమాలు
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.