Tollywood: చేసింది మూడే సినిమాలు.. కానీ టాప్‌లో నిలిచిన ముగ్గురు డైరెక్టర్లు
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక అరుదైన, ఆసక్తికరమైన పోకడ కనిపిస్తోంది. కేవలం మూడు సినిమాల అనుభవంతోనే ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు యువ దర్శకులు… టాలీవుడ్ బిగ్‌గన్ ప్రభాస్‌తో సినిమా చేయడం కాకతాళీయంగా మారింది. వీరు తీసుకునే సమయం, వారి విజన్, ప్రభాస్‌తో వారి అనుబంధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో కేవలం మూడు సినిమాలే చేసినా, సందీప్ రెడ్డి వంగ అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. 2017లో ‘అర్జున్ రెడ్డి’తో లవ్, ఎమోషన్‌ను కొత్త కోణంలో చూపించి రికార్డులు తిరగరాశారు. ఇదే కథ హిందీలో ‘కబీర్ సింగ్’గా రూపాంతరం చెందింది. ఇక ‘యానిమల్’తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించారు. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కించనుండగా, వంగా స్టైల్‌లో ఇది మరో అత్యంత తీవ్రమైన యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దాదాపు పదేళ్ల కెరీర్‌లో మూడే చిత్రాలు చేసినా, ప్రతి సినిమా ఒక సిగ్నేచర్ స్టైల్‌ను కలిగి ఉంది. 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’తో జీవిత తత్వాన్ని, ‘మహానటి’తో బయోపిక్ మ్యాజిక్‌ను, ఆపై ‘కల్కి 2898 AD’తో సైన్స్ ఫిక్షన్ మరియు పురాణాల కలయికను అద్భుతంగా ఆవిష్కరించారు. ‘కల్కి’ విజయం తర్వాత, ఈ దర్శకుడు ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూసేలా సినీ ప్రేమికులకు కొత్త ఆశను నింపారు.
24 ఏళ్ల పిన్న వయసులోనే 2014లో ‘రన్ రాజా రన్’తో తన ప్రతిభను నిరూపించుకున్నారు సుజీత్. కేవలం రెండో సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ చేసే అవకాశాన్ని దక్కించుకొని పాన్-ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘ఓజి’తో తన ప్రత్యేకమైన విజన్‌ను మరోసారి రుజువు చేసుకున్నారు. 11 ఏళ్ల సినీ ప్రస్థానంలో నెమ్మదిగా సినిమాలు చేసినా, ఆయన ప్రెజెంటేషన్ మాత్రం సూపర్ ఫాస్ట్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సుజీత్, నేచురల్ స్టార్ నానితో తన తదుపరి ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురు యువ మేస్ట్రోల రాక, టాలీవుడ్ కథా విధానంలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది.
