Ananya Nagalla: వావ్ వాట్ ఏ బ్యూటీ.. బంగారు హుండీని చిల్లరకు వాడుతున్నారేంట్రా
Ananya Nagalla: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ నటి, వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించిన అనన్య, బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో కొద్దిరోజులు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో 2017లో ‘షాదీ’ అనే లఘు చిత్రంతో తన కెరీర్ ప్రారంభించారు.
2019లో వచ్చిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ప్రియదర్శి సరసన నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అనన్య వెనక్కి తిరిగి చూడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘తంత్ర’, ‘పొట్టెల్’, ‘డార్లింగ్’, ‘శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్’ వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అనన్య నాచురల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నటనకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి గద్దర్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ గుర్తింపు ఆమెలోని ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం ఆమెకు ఒక స్టార్ హీరోతో సినిమా పడితే, టాలీవుడ్‌లో మరింత స్టార్‌డమ్ వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అనన్య చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆమె పట్టు వస్త్రాలు, ఆభరణాలతో లక్ష్మీదేవిలా మెరిసిపోయారు. సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.