దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ సంస్మరణార్థం జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
“నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు” అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.#YSRVardhanthi #YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2020
