Ts Government Office Timings:ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త….కార్యాలయాల,విద్యాసంస్థల పనివేళలు కుదింపు
ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి శుభవార్త అందించింది తెలంగాణా ప్రభుత్వం. అయితే ఇది, అందులో పనిచేసే ముస్లిం ఉద్యోగులకి మాత్రమే.రంజాన్ నెల ప్రారంభం మొదలైన సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ ప్రార్ధనకి సమయానికి కేటాయించేవిధంగా వీలుగా వారి పని వేళలు కుదిస్తున్నట్లు తాజాగా జీవో జారీ చేసింది .సాయంత్రం 5 కి బదులు 4 కే పనివేళలు కుదించింది.దీనితో గంట ముందుగానే ముస్లిం ఉద్యోగులు తమ ఇంటికి చేరుకోనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది .ఇది ఈరోజు నుండి వచ్చే ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది రంజాన్ ఒకటి.ఇందులో భాగంగా సూర్యోదయంకి ముందు ఉపవాస దీక్షని చేపట్టి, సూర్యోదయం తరువాత దీక్షని విరమిస్తారు.అందుకు అనుగుణంగానే ముస్లిం ఉద్యోగులకి పనివేళల్లో వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపింది. అటు ప్రభుత్వం కూడా రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే