Tspsc Online Exams:అభ్యర్థులూ అలెర్ట్… ఇకపై పరీక్షలన్నీ ఆన్ లైన్లో నే నిర్వహించాలని TSPSC నిర్ణయం
Tspsc లో వరుస పేపర్ లీకేజి వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజుకో పేపర్ లీకేజ్ అన్న చందంగా తయారయింది.Tspsc లో పని చేస్తున్న ఉద్యోగుల వల్ల ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ అయిన వేళ తెలంగాణా ప్రభుత్వం, Tspsc అప్రమత్తం అయ్యాయి. పేపర్ లీకేజ్ అంశానికి తావు ఇవ్వకుండా, ఇకపై అన్ని పరీక్షలని పూర్తిగా ఆన్ లైన్ లో నిర్వహించాలని యోచిస్తోంది.
ఇందుకు Tspsc కార్యాచరణ రూపొందిస్తోంది.అభ్యర్థులు ఎంతమంది ఉన్నా… విడతల వారీగా పరీక్ష నిర్వహించి నార్మలైజేషన్ విధానం అమలు చేసేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది.తొళుత వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్,ఏఈ,AMVI, పాలిటెక్నిక్ లెక్చరర్స్,ఏఈఈ పరీక్షలకు.. తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకి CBRT విధానాన్ని విస్తరించునుంది.