TSPSC Paper Leakage :పేపర్ లీకేజ్ అంశంపై బండి సంజయ్ సీరియస్… సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్
TSPSC పేపర్స్ లీకేజీ వ్యవహారం నిరుద్యోగుల పరంగా కాకుండా పెద్ద ప్రకంపనలే సృష్టిస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పేపర్ లీకేజ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తో అమీతుమీకి సిద్ధం అయ్యారు. వెంటనే పేపర్ లీకేజ్ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే Tspsc కమిషన్ మరియు ఛైర్మెన్, కార్యదర్శుల నియామకాల్లో కేసీయార్ కుటుంభ పాత్ర ఉందని ఆరోపించారు. లీకేజ్ పై విచారణతో పాటు ఛైర్మెన్, సభ్యులని వెంటనే విధుల నుండి తొలగించాలని, ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
అలాగే బండి సంజయ్ మాట్లాడుతూ మొత్తం కేసీయార్ పాలనలో ఇప్పటివరకు నిర్వహించిన అన్ని Tspsc పరీక్షల పేపర్లు అన్నీ లీక్ అయ్యాయానే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షల ప్రశ్న పత్రాలు కేసీయార్ టీం కు లీక్ అయ్యాయని.. దీనికి సంభందించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అందుకే ప్రస్తుత పేపర్ లీకేజ్ ప్రధాన నిందితుడు, కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అత్యధికంగా 103 మార్కులు వచ్చాయని అతని OMR షీట్ ని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ చేశారు.
Tspsc చైర్మన్ కి తెలియకుండా పేపర్ లీక్ కావడం అనేది దాదాపు అసాధ్యం అని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. ఈ అంశాన్ని కేసీయార్ ప్రభుత్వం నీరు గార్చేందుకు ప్రయత్నిస్తుంది అని… కింది స్థాయి ఉద్యోగుల్ని ఈ కుట్రకి బాధ్యులని చేసి తమ తప్పులని కప్పిపుచ్చుకోవాలని పెద్ద స్కెచ్ వేసినట్టు అర్ధం అవుతుందని ఆరోపించారు