ఒకపక్క కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో, కరోనా అదుపులోకి వచ్చేంతవరకు సర్వదర్శన టోకెన్లను నిలిపివేసే ఆలోచనలో టీటీడీ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకి 3వేలకు మించి 5వేల వరకు టికెట్లు ఇస్తున్నా కోవిడ్ నిబంధనలు పాటించకుండా భక్తులు ఎగబడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రక్రియలో భాగంగా తిరుపతిలో కరోనా విస్తరించే ప్రమాదం ఉందంటున్న అధికార యంత్రాంగం సూచనలు మేరకు టిటిడి బోర్డు ఈ దిశగా ఆలోచిస్తుంది.
గతంలో నాలుగు సార్లు సర్వదర్శన టోకెన్లను నిలుపుదల చేసిన టీటీడీ, ఇటీవలే భక్తుల కోరిక మేరకు పునరుద్ధరించింది.తిరిగి నిలిపివేసే దిశగా ఆలోచిస్తుంది, అయితే దీనిపై ఇంకా బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.