జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చారిత్రక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు TTD వ్యవహార శైలి వల్ల ప్రతీ విషయంలో భక్తుల నుండి రాజకీయ నాయకులు నుండి ఏదో ఒక టైం లో విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా అలిపిరి నుండి తిరుమల కాలినడక మార్గం పునఃనిర్మాణం మీద TTD మీద విమర్శలు మొదలైయ్యాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ముందుకొచ్చి అలిపిరి తిరుమల కాలినడక మార్గం మరియూ పైకప్పు ఆధునికీకరణ పనులకి 25 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు.
అయితే, ఆల్రెడీ ఉన్న కాంక్రీటు పైకప్పు చాలావరకూ బాగానే ఉండగా, TTD మాత్రం మొత్తం కొత్తగా నిర్మించేలా నిర్ణయం తీసుకోవడం తో వివాదం మొదలైంది.
ఎందుకంటే ఇప్పుడున్న కాంక్రీటు పైకప్పు 25 సంవత్సరాల క్రితం నిర్మించారు, నిర్మించినప్పుడు 50 సంవత్సరాల కాలం దృష్టిలో పెట్టుకని దృఢంగా నిర్మించారు. ఇప్పుడు అంబానీ నిధులు ఇస్తున్నాడు కదా అనీ బాగానే ఉన్న దాన్ని ఎందుకు మళ్లీ నిర్మంచడం, పాడైన చోట మాత్రమే కొత్తగా నిర్మించి మిగిలిన డబ్బుతో తిరుమలలో ఆరోగ్య వసతులకి ఖర్చుపెట్టుకోచ్చు కదా అని తిరుమలలోని పెద్దలు మరియూ భక్తులు కోరుతున్నారు.