Uses of Morning Walk in Winter : ఉదయాన్నే మార్నింగ్ వర్క్ చేయడం చాలా మంచిది. నడక వల్ల ఎనర్జీ వచ్చి ఒత్తిడి దూరమవుతుంది. ఉదయాన్నే నడకను అలవాటు చేసుకుంటే శరీరంలోని భాగాలన్నీ సవ్యంగా పనిచేస్తాయి. అలాగే జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. పచ్చని ప్రకృతిని కూడా ఆస్వాదించినవారు అవుతారు.
చాలామంది తమ రోజువారి వ్యాయామంలో నడకను కూడా ఒక భాగం చేసుకొని కనీసం గంట నడిస్తే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మార్నింగ్ వాక్ వల్ల డయాబెటిస్ పేషేంట్స్ కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సూర్యరశ్మి సమయంలో మార్నింగ్ వాక్ వెళ్తే సూర్యుడి నుండి పొందే డి విటమిన్ మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

అయితే అన్ని కాలాల్లో వాక్ కి వెళ్లడం వేరు, మరి చలికాలంలో మార్నింగ్ వాక్ మంచిదేనా, ఎటువంటి వారు మార్నింగ్ వాక్ కి వెళ్లాలి. వెళితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం..మార్నింగ్ వాక్ కి వెళ్లడం వల్ల మనిషి శరీర భాగంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకే చాలామంది మార్నింగ్ వాక్ ని తమ డైలీ జీవితంలో భాగం చేసుకుంటారు.
అయితే చలికాలంలో మంచు పడే సమయంలో మార్నింగ్ వాక్ కి వెళ్లడం కాస్త శ్రేయస్కరం కాదంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా గుండె సమస్యలు, నిమోనియా, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్లకపోవడమే మంచిది. అలాగే టైట్ దుస్తులు వేసుకోకూడదు. చేతులకి, కాళ్ళకి గ్లౌజులు వేసుకోవాలి. ఇలాంటివారు ఉదయం కాకుండా సాయంత్రం సమయంలో వాక్ కు వెళ్తే మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
