Uttarakhand AIIMS Hospital : 40 కి. మీ లు.. కేవలం 30నిమిషాల్లో మందులు చేరవేసిన డ్రోన్..
అత్యాధునిక సాంకేతికతో దూసుకెళ్తున్న నేటి రోజుల్లో… వైద్య పరంగా గొప్ప ముందడుగు పడింది.
మారుమూల గ్రామాల్లో.. కనీసం రోడ్డు కూడా లేని బాహ్య ప్రపంచంలో బతుకుతున్న ప్రజలు ఎందరో ఉన్నారు ప్రపంచం నలుమూలలా..
అలాంటివారికి నిత్యావసరాలు కావాలన్నా.. కనీస అవసరాలు కావాలన్నా వారే ఊర్లోకో.. పట్టణాలకో వస్తే కానీ పని జరగదు..
కానీ అలాంటివారికి ఆరోగ్యం పరంగా ఏమైనా అత్యవసర పరిస్థితులు వస్తే గనుక ఇక అంతే సంఘతులు.. సరైన సమయంలో వైద్యం అందక పోతున్న ప్రాణాలు కోకొల్లలు..
ఇక అలాంటి సంఘటనలకి చెక్ పెట్టేలా.. కనీసం ప్రాధమిక చికిత్స అందించి అయినా ప్రాణాలు అప్పటివరకు కాపాడేందుకు వినూత్న ఆలోచన చేశారు ఉత్తరాఖాండ్ రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం.
ఇందుకోసం రెండు కిలోల బరువైన మెడిసిన్స్ కేవలం 30నిమిషాల్లో 40 కిలోమీటర్ల గమ్యస్థానం విజయవంతం గా చేరుకునే ప్రయోగం చేసి సఫలీకృతం అయ్యారు.
ఈ ప్రయోగం వల్ల మున్ముందు గిరిజన ప్రాంతాలకి.. కనీసం రోడ్డు సదుపాయం.. వైద్య సదుపాయం లేని ఊర్లకి చాలా మేలు కలుగుతుందని.. తద్వారా చాలా మరణాలు అరికట్టవచ్చని వైద్యలు సంతోషం వ్యక్తం చేశారు.