Vaani Kapoor : సినిమా ఇండస్ట్రీకి వచ్చీ రాగానే ఒకట్రెండు సినిమాల్లో నటించి తళుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, కోలీవుడ్ కి వలస వెళ్లిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే తెలుగులో 2014వ సంవత్సరంలో నేచురల్ స్టార్ హీరోయిన్ నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం చిత్రంలోల్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించిన ముంబై బ్యూటీ వాణీ కపూర్ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే ఈ అమ్మడు ఆహాకళ్యాణం చిత్రంలో నటించిన తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఈ సినమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో మంచి టాలెంట్, అందం, అభినయం ఉన్నప్పటికీ వాణీ కపూర్ కి సరైన గుర్తింపు మాత్రం లభించడం లేదు.
అయితే ఈ మధ్య కాలంలో నటి వాణీ కపూర్ కి పెద్దగా సినిమా ఆఫర్లు లేకపోవడంతో వరుస ఫోటో షూట్లలో నటిస్తూ ఘాటుగా ఫోటోలకి పోజులు ఇస్తోంది. ఈ క్రమంలో బికినీలు, క్లీవేజ్ షోలు, అలాగే మంచి గ్లామర్ షో చేస్తోంది. దీంతో ఈ అమ్మది అందానికి నెటిజన్లు ఫిధా అయ్యారు. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ టాప్ లెస్ దుస్తులు ధరించిన ఫోటోలు తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేగాకుండా ఈ ఫోటోలకి “నో టైటిల్స్ జస్ట్ వైబ్స్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫోటోలతో పాటూ క్యాప్షన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో నటి వాణీ కపూర్ కి నటన పరంగా అమంచి టాలెంట్ ఉందని కానీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆఫర్లు దక్కించుకోలేక పోతోందని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకూ నటి వాణీ కపూర్ తెలుగు, హీనదనీ తదితర భాషలలొ 6 కి పైగా చిత్రాల్లో నటించింది. కాగా చివరగా 2022 వ సంవత్సరంలో హిందీ ప్రముఖ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించన షంషేరా అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఖేల్ ఖేల్ మైన్, రైడ్ 2 తదితర చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలైనా ఈ అమ్మది సినీ కెరీర్ ని మలుపు తిప్పుతాయో లేదో చూడాలి.