Vande Bharat Train :ఇక తిరుపతికి 8 గంటల్లోనే ప్రయాణం… వారంలోనే వచ్చేస్తున్న “వందేభారత్”
తెలంగాణా ప్రజలకి, భక్తులకి శుభవార్త..ఇకపై తిరుపతి ప్రయాణం అత్యంత సులువుగా,తొందరగా ఆ వేడుకొండలవాడిని దర్శనం చేసుకునే వీలు కలగబోతుంది.త్వరలోనే వందే భారత్ రైలు సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రారంభం కాబోతుంది. దీనితో చాలా తక్కువ సమయంలోనే తిరుపతి కి చేరుకునే అవకాశం కలిగింది భక్తులకి.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతికి రైలు ప్రయాణానికి దాదాపుగా 12 గంటలు పడుతుండగా.. వందే భారత్ ఆ సమయాన్ని కేవలం 8 గంటలుగా మార్చడానికి దూసుకొస్తుంది. ఈ నెల 8 నే ప్రధాని మోదీ వందే భారత్ రైలుని జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఒక రైలు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్య విజయవంతం గా పరుగులు పెడుతున్న నేపథ్యంలో, తాజాగా మరో రైలుని సికింద్రాబాద్ నుండి తిరుపతికి ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే మొదటి రైలుని ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుని ప్రారంభించడానికి మోదీ నగరానికి వస్తున్నారు. దానితో పాటు MMTS రెండో దశకి సంభందించి ఫలక్ నుమా – హుందా నగర్, సికింద్రాబాద్ -మేడ్చెల్ సర్వీస్ లను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.