Varahi VijayaYathra : పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ముందు నుండి కూడా అండగా ఉంటారు. వారికి ప్రమాదాలు జరిగిన, కుటుంబాలకు అండగా ఉండి భరోసా ఇస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన 48 క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు.
మీరంతా మా కుటుంబం ,మీకు అండగా నిలబడటం మా బాధ్యత,కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అది తీరని లోటు.. దానిని ఎవరూ తీర్చలేం కానీ మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని ఆదుకునేందుకు అతి పెద్ద జనసేన కుటుంబం అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముందుగా ప్రమాదవశాత్తు చనిపోయిన క్రియాశీలక సభ్యుల చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. చనిపోయిన మీ కుటుంబ సభ్యులు ఏ ఆశయం కోసం చివరి వరకు జనసేన పార్టీ కోసం అండగా
నిలిచారో, వారి ఆశయాన్ని గౌరవించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు జనసైనికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు. ఖజానాలో లక్షల కోట్లున్న రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ఏ అధికారం లేకపోయినా జనసేన పార్టీ సమర్ధవంతంగా చేస్తోంది.
పార్టీ క్రియాశీలక సభ్యులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆపత్కాలంలో ఆర్ధికంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పోయిన ప్రాణాలను తీసుకురాలేము కానీ, వారి కుటుంబాలకు ఆర్ధికంగా ఆదుకోవడం ద్వారా భరోసా ఇవ్వడం మన కనీస బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు. పోరాట యాత్ర సమయంలో ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు కరెంటు సాకుతో మృత్యువాతపడ్డారు. దిగువ మధ్యతరగతికి చెందిన ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆనాడే సొంత నిధుల నుంచి చెరో రూ. 5 లక్షల చొప్పున ఇచ్చాం అని ఆయన వెల్లడించారు.