• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Varahi VijayaYathra : కాకినాడలో కదం తొక్కిన వారాహిరథం.. పదం కలిపిన జనసైన్యం

Rama by Rama
July 4, 2023
in Janasena News, Latest News, Political News
0 0
0
Varahi VijayaYathra : కాకినాడలో కదం తొక్కిన వారాహిరథం.. పదం కలిపిన జనసైన్యం
Spread the love

Varahi VijayaYathra : జనసేననికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరు ఊహించని విధంగా జనసేన నేతకు ప్రజలు అడుగడుగున నీరాజనాలు అర్పిస్తున్నారు. కాకినాడ నగరం నడిబొడ్డున వేలాదిగా జన సైనికులు పదం కదపగా జనసేన ప్రచార రథం వారాహి కదం తొక్కింది. నగర వీధుల్లో విజయనాదం చేస్తూ పరుగులు తీసింది. కాకినాడ తీరాన ఉన్న సముద్రం జన ఉప్పెనగా మారి నగరంపై విరుచుకుపడిందా అనిపించే స్థాయిలో జనసేన శ్రేణులు గర్జించాయి.

వారాహి విజయ యాత్రతో నాగమల్లి తోట జంక్షన్ వద్ద గల ముర్తా క్లబ్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు రహదారిని ఇసుక వేస్తే రాలనంతగా జనప్రవాహం ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం గం. 6.30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ గారు వారాహి రధాన్ని అధిరోహించి సమరనాదం చేసి యాత్ర మొదలు పెట్టారు. ప్రతి అడుగులో జనసేన శ్రేణుల హర్షాతిరేకాల నడుమ ఆడపడుచులు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి హారతిని స్వీకరించి కళ్లకు అద్దుకున్న పవన్ కళ్యాణ్  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వారాహి విజయ

యాత్ర ఆద్యంతం వారాహి రథానికి వెనుకా, ముందు కూడా రెండు కిలోమీటర్ల మేర రహదారి ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసింది. ఆ జనప్రవాహం మధ్య తన కోసం వచ్చిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు.కాకినాడ పురవీధులు జనంతో నిండిపోవడంతో పవన్ కళ్యాణ్ సమీపం నుంచి చూసేందుకు జనసైనికులు

రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు, వాహనాల ఆశ్రయించారు. మరికొందరు వారాహి విజయయాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల మీదకు ఎక్కారు. జయహో జనసేనాని అంటూ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడుగునా పూల వర్షం కురిపించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాకకు సంకేతంగా వీర మహిళలు ఎరుపు రంగు బెలూన్లు గాలిలోకి వదిలారు. జనసైనికులు పూల వర్షం కురిపించారు.

వారాహి విజయ యాత్ర సభకు వేదిక అయిన సర్పవరం జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పిల్చి ఆహ్వానం పలికారు. వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన నాయకులు కాకినాడ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో రహదారులు మొత్తం జనసేన జెండాలు, బ్యానర్లతో ముంచెత్తారు. నాగమల్లీ తోట జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ మధ్య ప్రాంతం మొత్తం వారాహి స్వాగత తోరణాలు, హార్డింగులతో నిండిపోయింది.

పలువురు మహిళలు కాబోయే ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన జనసైనికులు చేతబూనిన ఫ్లకార్డులు, మినీ హార్డింగులు ఆకట్టుకున్నాయి. సర్పవరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం సాగుతున్నంతసేపు పార్టీ శ్రేణులు మద్దతుగా ఆయనపై పూల వాన కురిపించారు.

 


Spread the love
Tags: AP NewsBjpChandrababuNaiduJanaSainikJanasenaJanasena Varahi Vehicle in VIjayawadaJanasena veera mahilaluKakinadaNadendla ManoharNadendla Manohar about Varahi AmbulanceNadendla Manohar Press Meet About Varahi YatraNagababuPawan Kalyan Varahi YatraPawanKalyanPeople are Welcoming Pawan KalyanTdpVarahi for Election BattleVarahi VijayaYathraYCPYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.