Varun Tej : వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వాటిని నిజం చేస్తూ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఈ నెల 9న జరుగనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంగా సింపుల్‌గా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక జరుగనున్నట్లు తెలుస్తుంది. అయితే మెగా వారింటి నుండి ఈ వార్తలపై కన్ఫర్మేషన్ రావలసి ఉంది. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ తో పాటు అంతరిక్షం సినిమాలు చేశారు.
తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పిజ్జా ప్రిపేర్ చేస్తోన్న ఫోటో ను షేర్ చేశాడు. ఈ ఫోటోతో పాటు గవ్వలు చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందే వంట నేర్చుకుంటున్నావా బ్రో అని కొందరు.. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక అభిమాని ‘ నీకు వంటలో శిక్షణ ప్రారంభం.. అని కామెంట్ చేయగా.. ఎంగేజ్‌మెంట్ కోసం రుచికరమైన వంటకాలను తయారు చేస్తున్నారా?
అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇంకొకరు పెళ్లికూతురు లావణ్య ఎక్కడున్నారు అంటూ వరుణ్ ని ఆటపట్టిస్తున్నారు నెటిజన్స్. వరుణ్‌తేజ్ ప్రస్తుతం గాండివధారి అర్జున మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది.
https://www.instagram.com/p/Cs-v9oExhff/?igshid=MzRlODBiNWFlZA==