Varun Tej new look : వరుణ్ తేజ్ షాకింగ్ లుక్ వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా ఏమాత్రం కలిసి రావడం లేదు. వరుణ్ తేజ్ చివరగా నటించిన గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా ఇలాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రంతో తప్పనిసరిగా విజయం అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విషయంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి కేరింగ్ తీసుకుంటున్నాడు. వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ హారర్ కామెడీ జోనర్ లో రూపొందుతోంది. వరుణ్ తేజ్ తన పర్సనల్ లైఫ్ తో కూడా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2023లో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్, లావణ్య
త్వరలో ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి గర్భవతి. లావణ్య త్రిపాఠి గర్భవతి కావడంతో వరుణ్ తేజ్ ఆమె పట్ల చాలా కేరింగ్ చూపిస్తున్నాడట. తాజాగా ఈ దంపతులు మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లారు. ఆ దృశ్యాలని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
View this post on Instagram
ఈ ఫోటోల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ లుక్ మాత్రం షాకింగ్ గా ఉంది. అసలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా వరుణ్ తేజ్ సరికొత్త లుక్ కనిపిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసమే వరుణ్ డిఫరెంట్ లుక్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.