Vastu Tips : సమస్యలేని ఇల్లు అంటూ ఉండదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులు అవలంబించడం వల్ల సమస్యల నుండి దూరం కావచ్చు. వాస్తు చిట్కాలను అనుసరించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం వల్ల చాలా మంచి జరిగి, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల అదృష్టం, ఆనందం ఆ ఇంటి సొంతం అవుతుంది. ఇంట్లో స్నేక్ ప్లాంట్ ను నాటడం ద్వారా నెగటివ్ ఎనర్జీ దూరం అయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కల వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ దూరమవుతాయి.
అరటి మొక్కను ఇంట్లో నాటుకొని గురువారం నాడు ఆ మొక్కకు పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జెడ్ ప్లాంట్ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆ ఇల్లు ధనంతో నిండిపోతుంది. అంతేకాకుండా ఇతరులతో స్నేహ, సంబంధాలను పెంచుకునే లాగా ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.
వీటితోపాటు రబ్బర్ ప్లాంట్, వెదురు మొక్కలు కూడా ఇంట్లో నాటుకుంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి, సమస్యలను దూరం చేసి ఆ ఇంటిని శుభప్రదంగా ఉండేలాగా చేస్తాయి.