నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాకు గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకొని సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలతో సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ సినిమాతో మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపడానికి సిద్దమౌవుతున్నాడు బాలయ్య. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్(Veera Simha Reddy Pre Release Event) నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీంతో ప్రత్యామ్నాయ వేదిక కోసం వీరసింహారెడ్డి యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో జరుపుతారా లేదా హైదరాబాద్‌లో జరుపుతారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య సరసన తొలిసారిగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.