శాఖాహార మొసలి.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజమిది. కేరళ లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం లో ఉన్న చెరువులో 75 ఏళ్లకు పైగా నివసించిన “బాబియా” అనే మొసలి అసలు మాంసాహారం ముట్టలేదు అంట.
ఆలయ అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం, ఆలయ అధికారులు రోజుకు రెండుసార్లు వడ్డించే ప్రసాదం మాత్రమే తింటూ ఆ మొసలి ఇన్నాళ్లూ బ్రతికింది .. భక్తులు బబియాని దేవత యొక్క పునర్జన్మ గా.. ఆలయ సంరక్షకుడి గా భావిస్తారు. అయితే ఈ మొసలి ఈ ఆలయం లోకి ఎప్పుడు ఎలా వచ్చింది అనేది మాత్రం ఎవరికీ తెలీదు. దానికి బాబియా అనే పేరు ఎవరు పెట్టారు అనేది కూడా తెలియదు.
గత 75 ఏళ్లుగా అదే ఆలయ చెరువులో ఎవరికీ హాని తలపెట్టక అక్కడే భక్తులు ఇచ్చే ప్రసాదాలు తిని బ్రతుకుతున్న బాబియా ఈ ఆదివారం మరణించింది అని అక్కడ అధికారులు తెలిపారు. బబియా మరణ వార్తతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని చివరి దర్శనం చేసుకున్నారు. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బబియా మొసలికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆలయం సమీపంలో పూడ్చిపెట్టారు.