టాలీవుడ్‌లో మరో తీవ్రవిషాదం నెలకొంది. తెలుగు చిత్రసీమ తొలితరం నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. రెండు రోజుల క్రితం నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అనంతలోకాలకు చేరుకోగా.. నేడు సీనియర్ యాక్టర్ చలపతిరావు (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంతో తుదిశ్వాస విడిచారు.
ఆయనకు కుమారుడు రవిబాబు (నటుడు, దర్శకుడు) కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి ఆయన స్వస్థలం బల్లిపర్రు (కృష్ణాజిల్లా) వెళుతుంటారు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావును సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
Also Read: భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతున్న స్మార్ట్ ఫోన్.. ఎలానో తెలుసా
మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు.
Veteran Telugu actor Chalapathi Rao, who had shared screen space with Senior Actors NT Rama Rao, Krishna, Chiranjeevi, and others, breathed his last on December 23.