Vidhyuth Artisans Dharna:విధ్యుత్ ఆర్టిజన్ ల మహా ధర్నా…హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్
ఈరోజు తలపెట్టిన విధ్యుత్ ఆర్టిజన్ ల “చలో విధ్యుత్ సౌధ” ధర్నా భారీ విజయవంతం అయింది.దీనితో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం,Prc అమలు,అలాగే సియం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆర్టిజన్ లు భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీనితో ఖైరతాబాద్ లోని పరిసర ప్రాంతాలు విధ్యుత్ ఉద్యోగుల నినాదాలతో మారుమోగింది.
అయితే ప్రధానంగా గత సంవత్సర కాలం నుండి Prc కొత్త వేతనం అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందని ఆర్టిజన్ లు వాపోయారు. అలాగే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆర్టిజన్ ల కి కన్వర్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని, అలాగే ఆర్టిజన్ లకి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా ఒకే రూల్ Apseb రూల్స్ అమలు చేయాలని H-82 తరపున యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు.తక్షణమే ఆర్టిజన్ ల పర్సనల్ పే ని బేసిక్ పే లో కలిపి 40% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తదనంతర కాలంలో సమ్మెకు కూడా వెనుకాడం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.