Vidhyuth Employees Strike :నేడు విధ్యుత్ ఉద్యోగులతో తెలంగాణా ప్రభుత్వం చర్చలు…. సమ్మెకు వెళ్లకుండా ప్రయత్నాలు
తెలంగాణా విధ్యుత్ ఉద్యోగులతో చర్చలకు నేడు మరో దఫా కేసీయార్ ప్రభుత్వం సిద్ధం అయింది. నేడు ఉద్యోగులతో విధ్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల తమ న్యాయమైన డిమాండ్లు, PRC అమలు, ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత యాజమాన్యం పిలిచి చర్చలు జరిపినా అవి సఫలం కాకపోవడంతో, ఈ నెల 17 నుండి నిరవధిక సమ్మె కి ఉద్యోగులు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతి ముఖ్యమైన విధ్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళితే దాదాపుగా తెలంగాణా మొత్తం అంధకారంలో మగ్గుతుంది. పైగా ఇది విద్యార్థులకి పరీక్షల సమయం.. అదీ కాక వాణిజ్య పరంగా, కంపెనీలకు, రైతులకి, గృహ అవసరాలకి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. దీనితో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయింది ఎట్టి పరిస్థితుల్లో విధ్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా, వారితో ఈసారి స్వయంగా విధ్యుత్ శాఖ మంత్రే చర్చలు జరుపడానికి సిద్ధం అయ్యారు. ఈ ఉదయం 10:30 గంటలకి విధ్యుత్ JAC నేతలతో చర్చలు ఉంటాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. చూడాలి మరి ఉద్యోగుల సమ్మె పిలుపు నేపథ్యంలో ఈసారి అయినా చర్చలు సానుకూలంగా ముగుస్తాయో లేదో.అటు ఉద్యోగుల్లో కూడా నేటి చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.