Vijay Antony : బిచ్చగాడు సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో అటు తమిళ ఇండస్ట్రీలో కూడా విజయ్ ఆంటోని హీరోగా విజయాన్ని అందుకున్నారు. కానీ ఆయన కూతురు లారా ఆత్మహత్య చేసుకొని ఆయనకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వార్త తెలియగానే అటు సినీ ఇండస్ట్రీ తో పాటు చాలామంది దిగ్భ్రాంతి గురయ్యారు.
2006లో ఫాతిమా అనే ఆమెను విజయ్ ఆంటోని వివాహం చేసుకోగా వారి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు లారా. తను ఇప్పుడు 12వ తరగతి చదువుతుంది. ఇంత చిన్న వయసులో తను బలవన్మరణానికి పాల్పడింది. 19వ తేదీ తెల్లవారుజామున చెన్నై డీడీకే రోడ్ లోని తన నివాసంలో లారా ఉరివేసుకొని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆళ్వార్ పేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా..
ఆమె అప్పటికే మరణించింది అని వారు ధ్రువీకరించారు. తమిళనాడులోని ఆళ్వార్ పేట పోలీసులు కేసును టేకప్ చేసి ఆత్మహత్య గల కారణాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా తను డిప్రెషన్ వల్లనే ఇలాంటి అఘాత్యానికి పాల్పడిందని వారు ప్రస్తుత సమాచారంగా తెలిపారు. దర్యాప్తులో మిగతా విషయాలు వెల్లడిస్తామని అన్నారు.