Vijay Deverakonda Anasuya : గతంలో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్, మాదర్ ** అనే బూతు పదం మీద అనసూయ భరద్వాజ్ బహిరంగంగానే విమర్శలు చేసింది. విజయ్ దేవరకొండ కూడా అనసూయ భరద్వాజ్ మీద పరోక్షంగా కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. లైగర్ రిలీజ్ టైంలో కూడా సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది.
ప్రెస్రెంట్ మళ్లీ విజయ్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసింది అనసూయ. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా ఫస్ట్ సాంగ్ మే 9 తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది విజయ్ దేవరకొండ’ అని పేర్కొనడం కాస్త.. అనసూయ భరద్వాజ్ దృష్టికి వచ్చింది.
ఇక తాజాగా అనసూయ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. నిజానికి ఇంగ్లీష్ గ్రామర్ పరంగా.. ఈ ‘ది’ అనే పదాన్ని యూనిక్ విషయాలకు, వస్తువులకు మాత్రమే వాడుతూ ఉంటారు. అంటే విజయ్ దేవరకొండ యూనిక్ అని అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు ఈ ‘ది’ పదాన్ని యాడ్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. కొందరు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమితాబచ్చన్, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్లే ఎప్పుడూ ఇలాంటి పదాలు వాడుకోలేదు.
కానీ ఇతడు మాత్రం నాలుగైదు సినిమాలకే ల్ ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ భరద్వాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడే ఒకటి చూశాను ‘ది’నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. అనసూయ డైరెక్ట్ గా విజయ్ పేరు ప్రస్తావించనప్పటికీ విషయం అందరికీ అర్థం అవుతూనే ఉంది. దీనిపై రౌడీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి..
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023
#NaRojaaNuvve Song From #Kushi Out On MAY 9th. pic.twitter.com/V61BXGjxhB
— TeluguMoviesClub (@TFIMovieUpdates) May 4, 2023
Discussion about this post