Rashmika on Kingdom: ‘కింగ్డమ్’ సినిమాకు పాజిటివ్ టాక్..: రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Rashmika on Kingdom: చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకు భారీ విజయాన్ని అందించిన చిత్రంగా ‘కింగ్‌డమ్’ నిలిచింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో సరికొత్త సినిమా వచ్చిందని సినీ ప్రియులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘కింగ్డమ్’ విజయంపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా విడుదలైన కొద్ది గంటలకే, రష్మిక తన ఎక్స్ ఖాతాలో విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. “ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘మనం కొట్టినం’ (I know how much this means to you and all those who love you 🥹❤️ “MANAM KOTTINAM”🔥)” అని రాసుకొచ్చింది. రష్మిక పోస్ట్‌కు విజయ్ దేవరకొండ కూడా “‘:,))) మనం కొట్టినం ❤️” అని బదులిచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండ కూడా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “‘:,) ఇప్పుడెలా అనిపిస్తుందో మీకు చెప్పాలని ఉంది.. మీరందరూ నాతో కలిసి దీన్ని అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను.. ఆ వెంకన్న స్వామి దయ 🙏 మీ అందరి ప్రేమ ❤️ ఇంకేం కావాలి నా లాంటి ఒక్కడికి.” అని పోస్ట్ చేశారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేశ్, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో నటించిన ‘కింగ్డమ్’ సినిమా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక పోలీస్ కానిస్టేబుల్ నుండి గూఢచారిగా మారిన ‘సూరి’ పాత్రలో కనిపించారు. సత్యదేవ్ తన చాలా కాలం క్రితం దూరమైన సోదరుడు ‘శివ’ పాత్రలో నటించగా, వెంకటేశ్ విలన్ ‘మురుగన్’గా, భాగ్యశ్రీ డాక్టర్ మధుగా కనిపించారు. భారత ప్రభుత్వం అప్పగించిన మిషన్ కోసం శ్రీలంకకు వెళ్లిన శివ, వ్యక్తిగతంగా తన సోదరుడితో తిరిగి కలవడానికి చేసే ప్రయత్నం ఈ కథ. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. నెక్ట్స్ పార్ట్ కోసం ఈ సినిమాకు శుభం కార్డు వేశారు.