Viral Leave Letter : ఎవరైనా సెలవు దేనికి పెడతారు..? ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినపుడో.. ఇంట్లోనో లేక బంధువుల ఇంట్లోనో ఏదైనా శుభకార్యానికో లేక మరేదైనా కారణం తోటో శెలవు పెడతారు.. కానీ అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు లీవ్ కావాలని కోరుతూ ఏఎస్పీకి లేఖ రాశాడు గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్..
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. గౌరవ్ చౌధరి కి ఒక నెల క్రితం వివాహమైంది. వెంటనే భార్యను ఇంటి వద్ద వదిలి విధుల కోసం తాను పనిచేస్తున్న చోటికి వచ్చి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో అతడి భార్య అలిగిందట.
Also Read : ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేక పోతున్న జగన్..
”పెళ్లైన వెంటనే నా భార్యను వదిలి వచ్చినందుకు ఆమె నాపై అలిగింది.నేను ఫోన్ చేసినా స్పందించడం లేదు. నా కాల్‌ను కట్ చేస్తోంది. కొన్నిసార్లు ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోంది. వెంటనే ఇంటికి వెళ్లి నా భార్యను బుజ్జగించేందుకు నాకు వారం రోజులు సెలవులు కావాలి” అని గౌరవ్ లేఖలో అభ్యర్థించాడు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గౌరవ్ బాధను అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతడికి అయిదు రోజులపాటు సెలవులు మంజూరు చేశారు.