Viral News : తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అని ఒక సామెత ప్రచారంలో ఉంది. అయితే దానిని నిజం చేస్తూ ఒక వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కొందరికి ఆ టర్నింగ్ పాయింట్ అనుకోని సందర్భంలో ఎదురై వారి జీవితాన్నే మార్చేస్తుంది.
అలాగే ఒక బస్ డ్రైవర్ జీవితం కూడా కళ్ళు మూసి తెరిచేసరికి కోటేశ్వరుడిని చేసి నిలబెట్టేసింది. ఆయనకు అదృష్టం చికెన్ కబాబ్ రూపంలో వచ్చింది. ఒక బస్సు డ్రైవర్ చికెన్ కబాబ్ కొనడానికి వెళ్లి కోటీశ్వరుడు అయ్యాడు. ఎలా అంటే.. ఈ ఘటన యూకేలోని లీసెస్టర్ నగరంలో జరిగింది. మిర్రర్ యుకె వారి కథనం ప్రకారం..
“స్టీవ్ గుడ్విన్” అనే 51 ఏళ్ల బస్సు డ్రైవర్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆకలి వేయడంతో, చికెన్ కబాబు దుకాణం దగ్గర బస్సును ఆపాడు. చికెన్ కబాబ్ ఆర్డర్ పెట్టిన సమయంలో కబాబ్ రావడానికి ఆలస్యం అవుతుందని తెలియడంతో, టైం పాస్ కోసం పక్కనే ఉన్న లాటరి షాపులో టికెట్ కొన్నాడు. అక్కడే అద్భుతం చోటు చేసుకుంది.
ఆ లాటరీ ఏకంగా అతనికి 10 కోట్ల 24 లక్షల అదృష్టాన్ని తీసుకొచ్చి ఆయన మీద కుమ్మరించింది. ఈ అనుకోని పరిణామంతో స్టీవ్ కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతూ తనుకోన్న లాటరీ నెంబరు 73 అని వివరిస్తూ.. అసలు ఇదంతా నేను ఊహించలేదు. నేను ఇప్పటికి ఇంకా షాక్ లోనే ఉన్నాను. అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. ముందుగా ఈ విషయాన్ని తన తల్లితో పంచుకున్నానని,
కుటుంబ సభ్యులు ఎవరు కూడా తన మాటను నమ్మలేదని, కానీ తర్వాత అది నిజమనీ తెలుసుకొని అందరూ ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారని స్టీవ్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుసుకున్న తర్వాత కూడా స్టీవ్ ఇంకా బస్సు డ్రైవర్ గానే తన విధులు నిర్వర్తించడం గమనార్హం.