KL Rahul Athiya Shetty: టీంఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టిల వివాహం జనవరి 23న అంగరంగ వైభవంగా జరిగింది. సినీప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పెళ్లికి ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్‌ల గురించి తాజాగా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఎమ్‌ఎస్ ధోనీ వంటి ప్రముఖులు కోట్ల రూపాయల ఖరీదైన బహుమతులు ఇచ్చారని సమాచారం. సునీల్ శెట్టి తన కుమార్తెకు ముంబైలో రూ. 50 కోట్ల విలువైన ఫ్లాటు ఇచ్చాడట. సల్మాన్ ఖాన్ రూ.1.64కోట్ల విలువచేసే ఆడీ కారు, కోహ్లి రూ.2.17 కోట్ల విలువైన BMW కారు,
జాకీష్రఫ్ అతియాకు రూ.30లక్షల విలువైన వాచ్, అర్జున్ కపూర్ అతియాకు 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రేస్‌లెట్, రాహుల్ కు ధోని రూ.80 లక్షల కవాసకి నింజా బైక్ ఇచ్చారని సమాచారం. ఇక అతియా, రాహుల్‌లు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కోసం ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సునీల్ శెట్టి మీడియాకు తెలిపారు.
https://www.instagram.com/p/CnwtWxgKsK9/?igshid=YmMyMTA2M2Y=