Virat Kohli Naatu Naatu Steps : గత కొన్నిరోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా నాటు నాటు పాటను హమ్ చేస్తూ హుక్ స్టెప్స్ వేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నాటు నాటు ఫీవర్ ఎక్కేసింది. మొన్న టీం ఇండియా సభ్యులు సరదాగా ఏదో గేమ్ ఆడుతూ నాటు నాటు స్టెప్స్ వేయగా తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ ఏకంగా మ్యాచ్ మధ్యలోనే నాటు నాటు హుక్ స్టెప్స్ వేసాడు. ఈ వీడియోని RRR టీం తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ రోజు ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ వన్డే మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా..
ఫీల్డింగ్ ఎంచుకుంది. స్లిప్స్ లో ఫీల్డింగ్ లో ఉన్న కోహ్లీ నాటు నాటుకి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే సింక్ లో వేసిన స్టెప్స్ ను తానొక్కడే వేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్స్ లైక్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. నాటు నాటుకి ఇది లైఫ్ టైం ఆచివేవ్ మెంట్ అని కొందరు కామెంట్ చేయగా.. దిస్ ఈజ్ కోహ్లీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
.@imVkohli 🕺🕺 #NaatuNaatu 🤩 pic.twitter.com/6jjZhH7fh2
— RRR Movie (@RRRMovie) March 17, 2023
Discussion about this post