కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు తరలించడానికి సంబంధించి కార్యాచరణ సమస్యలను ఖరారు చేయడంతో పాటు, ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వివో తో తన అనుబందాన్ని ముగించనుంది.
వివో – ఒక చైనా మొబైల్ ఫోన్ తయారీదారు. చైనా-ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను స్పాన్సర్ చేస్తోంది. వివో స్పాన్సర్షిప్లో ఇంకా మూడు ఎడిషన్లు ఉన్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో, భారతదేశం అంతటా ప్రజలు చైనా వస్తువులని బహిష్కరిస్తున్నారు. కేంద్రం కూడా పలు చైనా యాప్ లను బహిష్కరించింది. ప్రజలు అందరూ, చైనా వస్తువులని బ్యాన్ చేస్తుంటే, ఐపిఎల్ లని అతి పెద్ద క్రీడా వేడుక మీద ఒక చైనా కంపెనీ ముఖ్యమైన స్పాన్సర్ గా ఉండటం పై సోషల్ మీడియా లో పెద్ద దుమారమే లేచింది. కొన్ని జాతీయవాద సంస్థలు బిసిసిఐపై విరుచుకుపడ్డాయి. మాజీ మంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వివో ఇంకా మూడు ఎడిషన్లు ఉన్నా, మొత్తం ఐదు-సీజన్ ఒప్పందాన్ని ముగించడానికి బీసీసీఐ మరియు వివో పరస్పరం అంగీకరించాయి.
కీలకమైన బిసిసిఐ వ్యక్తులు – అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా – వివో ప్రతినిధులతో పాటు ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌తో మంగళవారం హాజరైనట్లు తెలిసింది . ఒప్పందాన్ని స్నేహపూర్వకంగా ముగించడానికి రెండు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది.
సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యుఎఇలో ఆడబోయే రాబోయే ఎడిషన్ మొత్తంలో కనీసం 30 శాతం తగ్గింపును వివో కోరుకున్నట్లు తెలిసింది. 2018 లో వివో రూ. టైటిల్ స్పాన్సర్‌షిప్ విలువ ఐదు సంవత్సరాలకు గాను 2,199 కోట్లు! (సంవత్సరానికి సుమారు రూ. 440 కోట్లు).
