War 2: ‘వార్ 2’ నుండి హైఎనర్జిటిక్ సాంగ్ టీజర్ వచ్చేసింది..!
War 2: ‘వార్ 2’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘దునియా సలాం అనాలి’ అనే మాస్ బీట్ సాంగ్ టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు పండగ వాతావరణం కల్పించింది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి స్టెప్పులు, ఎనర్జీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. అయితే, చిత్రబృందం ఈ పాటను థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తామని ప్రకటించడం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.
భారీ బడ్జెట్, భారీ రెమ్యూనరేషన్లు..
యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ‘వార్ 2’ స్పై యూనివర్స్‌లో భాగం. ఈ సినిమాను దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్లు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. నివేదికల ప్రకారం, ఎన్టీఆర్ రూ. 60 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 48 కోట్లు, కథానాయిక కియారా అద్వానీ రూ. 15 కోట్లు తీసుకున్నారు. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 35 కోట్లు అందుకున్నారు. ఈ నలుగురి రెమ్యూనరేషన్లు కలిపి రూ. 150 కోట్లు దాటాయి.
సౌత్ మార్కెట్‌పై బాలీవుడ్ దృష్టి..
ఈ సినిమాకు ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు రికార్డు ధర పలికాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్. నాగవంశీ రూ. 80 కోట్లకు ఈ డీల్‌ను కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక హిందీ సినిమా తెలుగు హక్కులకు ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ డీల్ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది.
దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్
‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఇందులో పవర్‌ఫుల్ స్పై పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక యాక్షన్ సీక్వెన్సులు, డైలాగులను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.