Weight Loss Food : అధిక బరువు సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య కూడా ఇదే. కఠిన వ్యాయామాలు, ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం,తినే విధానంలో నోటిని అదుపులో ఉంచుకోవడం, ఇలాంటివి చేసినా కూడా మళ్లీ ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. అయితే బరువు సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును ఐస్ క్రీమ్ లా కరిగించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో వెంటనే చూద్దాం..
ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో ఈ అధిక బరువు, పొట్ట చుట్టు కొవ్వుకు పేరుకుపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలి అంటే రోజువారి ఆహారంలో తృణధాన్యాలతో పాటు, రోటీలు, అన్నం తగ్గించి, కూరగాయలతో, ఆకుకూరలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకుంటే కొవ్వు తొందరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి.

మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ఆకుకూరల ద్వారా అందుతాయి. అందుకే ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరని భాగం చేసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఈజీగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మూడు నెలలు కఠినంగా ఈ నియమాన్ని పాటిస్తే ఈజీగా బరువు తగ్గవచ్చు. చాలామందిలో ఒత్తిడికి లోనైతే కూడా బరువు పెరుగుతూ ఉంటారు. కార్టీసోల్ అనే హార్మోను ఒత్తిడికి లోనైతే విడుదలవుతుంది. అధిక బరువు పెరగడానికి ఈ హార్మోన్ దోహదపడుతుంది. కాబట్టి టెన్షన్ లేకుండా ఉండాలి.
