Right Way of Eating Fruits: మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తారు వైద్యులు. రోజూ కనీసం ఒకటి, రెండు పండ్లనైనా మనం ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా సమ్మర్ లో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అయితే మనం పండ్లు తినేప్పుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాలు అందకుండా పోతాయి. కాబట్టి పండ్లు తినేప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు చూద్దాం..

● పాలు, టీ-కాఫీలతో పుల్లని పండ్లను తినవద్దు:
ఆరెంజ్ లాంటి పుల్లని పండ్లను తీసుకుంటే.. వాటిని టీ, పాలు లేదా కాఫీతో తినకూడదు. కొందరు ఫ్రూట్ సలాడ్‌ని కాఫీతో కలిపి తీసుకుంటారు. ఇలా చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు ఉదర సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అస్సలు ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లను తినొద్దు.
● పండ్ల తొక్కను తీసేయొద్దు:
అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి కొన్ని పండ్లను తొక్క తీసి తింటారు కానీ యాపిల్, జామ వంటి పండ్లను తొక్క తీయకుండానే తినాలి.

● పండ్లను ఎక్కువసేపు కోసి ఉంచవద్దు:
కొందరు పండ్లు తినడానికి చాలా ముందే కట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల పండ్లలోని పోషకాలు నశిస్తాయి.
● ఎక్కువ ఉప్పు వేసుకుని పండ్లను తినకండి:
కొందరు పండ్లలోని పోషకాలను నాశనం చేసే బ్లాక్ సాల్ట్, చాట్ మసాలాను ఎక్కువగా కలుపుతుంటారు. ఫ్రూట్ సలాడ్ తింటున్నప్పుడు పండ్లపై ఎక్కువ ఉప్పు వేయకండి. దీంతో పండ్లలోని సహజ లక్షణాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఉప్పు ఆరోగ్యానికి ముప్పే.
